అది సరిపోదు.. కచ్చితంగా వారికి మరణశిక్ష విధించాలి
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గ్యాలెంట్‌లపై అరెస్ట్ వారెంట్ ఒక్కటే సరిపోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అభిప్రాయపడ్డారు. బసిజ్ పారామిలటరీ ఫోర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేరగాళ్లకు మరణ దండన విధించాలి. మన శత్రువు గాజా, లెబనాన్‌లో విజయం సాధించరు. ఈ రెండు చోట్లా ప్రజల ఇళ్లపై బాంబులు జారవిడవడం విజయం కాదు. మూర్ఖులు అది ఆలోచించరు. ఎందుకంటే వారు ప్రజల ఇళ్ల, వైద్యశాలలు, కమ్యూనిటీలపై బాంబింగ్ చేస్తున్నారు. దానిని ఎవరూ విజయం అనుకోరు. వారు చేస్తున్నది నేరం. వారు (ఐసీసీ) అరెస్టు వారెంట్ మాత్రమే జారీ చేశారు. అది సరిపోదు. నెతన్యాహు, గ్యాలెంట్‌కు కచ్చితంగా మరణశిక్ష విధించాలి అని అలీ ఖమేనీ పేర్కొన్నారు.






