Iran :అమెరికాకు శిక్ష తప్పదు.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌పై అమెరికా దాడి తర్వాత సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తొలిసారి స్పందించారు. అమెరికా (America)కు శిక్ష తప్పదని హెచ్చరించారు. ట్రంప్ (Trump)ను ఓ జూదగాడిగా అభివర్ణించారు. అమెరికా తమ ప్రతీకార దాడులను ఎదుర్కోకతప్పదని హెచ్చరించారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ రహీం మౌసవి (Rahim Mousavi) కూడా అమెరికాపై తీవ్రంగా స్పందించారు. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది. మా పవిత్ర భూమికి హాని కలిగించింది. మా ప్రయోజనాల కోసం ఎంతటి చర్యకైనా వెనకాడబోము అని వ్యాఖ్యానించారు.