Iran : ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య కీలక పరిణామం …1000 మంది భారతీయులను

ఇజ్రాయెల్- ఇరాన్ (Israel-Iran )ల మధ్య ఉద్రికత్తలు రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తన గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ భారత్ (India)కోసం ప్రత్యేకంగా మినహాయంపు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 1000 మంది భారతీయులు (Indians) కొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధు (operation sindhu) లో భాగంగా ప్రత్యేక విమానాల్లో వీరు స్వదేశానికి రానున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ లోని పలు నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. తొలి విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకోనుండగా మరో రెండు విమానాలు శనివారం దిగనున్నట్లు సమాచారం. అయితే దీనికి ముందు ఇరాన్ నుంచి ఇప్పటికే 110 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ కి చేరుకున్నప్పటికీ వీరు తొలుత ఆర్మేనియా అక్కడ నుంచి భారత్‌కు వచ్చారు.