ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్
పశ్చిమాసియా భగ్గుమంటోన్న తరుణంలో మిత్ర దేశం ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. దానిపై నేరుగా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించారు. భద్రతాపరమైన పరిస్థితులు, ఇజ్రాయెల్ ఆపరేషన్ల గురించి ఆ దేశ రక్షణమంత్రితో మాట్లాడాను. తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కుకు మా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాను. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి పాల్పడితే ఇరాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని లాయిడ్ హెచ్చరించారు.






