భద్రతా మండలిలో మాకు శాశ్వత ..న్యూయార్క్లో
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పునరుద్ఘాటించారు. న్యూయార్క్లో నిర్వహించిన సర్వసభ్య సదస్సు (జనరల్ అసెంబ్లీ ప్లీనరీ)లో భద్రతా మండలిలో సమాన ప్రాతినిధ్యం అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నా 1962 నుంచి భద్రతా మండలిలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. ఐరాసలో శాశ్వత, అశాశ్వత జాబితాలో విస్తరణతో పాటు భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలన్నారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవానికి ఇది భారత్ తీసుకువచ్చే తీర్మానమని తెలిపారు. అదే విధంగా భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.






