IMF: ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్.. వెలుగుతున్న మోడీ నాయకత్వ ప్రభ…

భారత ఆర్థిక వ్యవస్థ మహశక్తిగా అవతరిస్తోంది. ప్రపంచం మాంద్యం వైపు వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నా.. భారత్ మాత్రం అనే విషయాల్లో ముందంజలో ఉంది. ఈ క్రమంలో FY25లో భారతదేశ GDP వృద్ధి గత 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడం వల్ల, భారతదేశ GDP 2025లో జపాన్, 2027లో జర్మనీ కంటే ముందు వరుసలో నిలవనుంది. IMF డేటా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. దీనికి విధాన సంస్కరణలు, బలమైన ఆర్థిక వృద్ధి కారణమని వెల్లడించింది ఐఎంఎఫ్..
గత పదేళ్లలో భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని రెట్టింపు చేసి 105 శాతం వృద్ధిని నమోదు చేసిందని IMF డేటా తెలిపింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్ల నుండి 2025లో 4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గతంలో పోల్చితే, అదే కాలంలో అమెరికా 66 శాతం, చైనా GDP 44 శాతం పెరిగాయి. దీంతో, భారతదేశం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ (30.3 ట్రిలియన్ డాలర్లు), చైనా (19.5 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4.9 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.4 ట్రిలియన్ డాలర్లు) తర్వాత ప్రపంచంలో GDP పరంగా ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.
IMF డేటా ప్రకారం, గత దశాబ్దంలో జపాన్ GDP పెద్దగా పెరుగుదల లేకపోవడంతో…, భారతదేశం త్వరలో జపాన్‌ను అధిగమించనుంది. గత దశాబ్దంలో యునైటెడ్ కింగ్‌డమ్ జీడీపీ 28 శాతం వృద్ధి చెందగా, ఫ్రాన్స్ జీడీపీలో 38 శాతం వృద్ధిని సాధించింది. 2015లో 2.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2025 నాటికి 3.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 50 శాతం కంటే ఎక్కువ GDP వృద్ధిని సాధించిన ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థలు రష్యా (57 శాతం), ఆస్ట్రేలియా (58 శాతం), స్పెయిన్ (50 శాతం)గా ఉన్నాయి. భారతదేశ GDP వృద్ధిని అపూర్వమైన రేటుతో చూపిస్తున్న IMF డేటాను బిజెపి మంత్రి అమిత్ మాల్వియా తన అధికారిక X పోస్ట్ ద్వారా పంచుకున్నారు.
ఈ వృద్ధి వేగం భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్‌గా నిలబెట్టింది. 2025 నాటికి జపాన్‌ను, 2027 నాటికి జర్మనీని అధిగమిస్తుందని బీజేపీ నాయకుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ అసాధారణ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి, ఆయన ప్రభుత్వ అవిశ్రాంత కృషికి నిదర్శనమన్నారు. చురుకైన ఆర్థిక విధానాలు, సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు, వ్యాపారాన్ని సులభతరం చేయడంపై అవిశ్రాంత దృష్టి ద్వారా, మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మార్చిందన్నారు.