ఏడాదిలో 1100 మంది భారతీయులు వెనక్కి : అమెరికా
అమెరికాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించి, నివసిస్తున్న భారతీయులపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 12 నెలల కాలంలో 1100 మంది భారతీయులను స్వదేశానికి తిప్పి పంపించింది. ఈ విషయాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలో సరిహద్దులు, వలస విధానం వ్యవహారాలను చూస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రౌసీ ముర్రే వెల్లడిరచారు. ఈ నెల 22న ప్రత్యేక విమానంలో భారతీయులను పంజాబ్‌కు తిప్పిపంపించామని ఆమె చెప్పారు. ఏడాదిలో మొత్తంగా 145 దేశాల నుంచి వచ్చిన 1,60,000 మందిని తిప్పి పంపినట్టు వివరించారు. అక్రమ వలసదార్లను తిప్పి పంపించడంలో భారత ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించినట్లు తెలిపారు.






