Tanya Tyagi :భారతీయ విద్యార్థిని మృతి ..అసలు ఏం జరిగిందంటే?

కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని మృతి చెందింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఢల్లీికి చెందిన తాన్యా త్యాగి కెనడా (Canada) లోని కాల్గరీ విశ్వవిద్యాలయం (University of Calgary) లో చదువుకుంటుంది. ఆమె గురువారం మరణించింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియలేదు. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. బాధిత కుటుంబానికి కాన్సులెట్ సంతాపం తెలిపింది. వారికి అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడిరచింది. త్యాగి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు (Investigation ) కొనసాగుతుందని పేర్కొంది.