ప్రవాస భారతీయ ప్రొఫెసర్ హత్య
అమెరికాలోని అట్లాంటాలో ప్రవాస భారతీయ ప్రొఫెసర్, వ్యాపారవేత్త అయిన శ్రీరాం సింగ్ (58) హత్యకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. ఉత్తర ప్రదేశ్‌లోని తుల్సీపుర్ మారaా గ్రామానికి చెందిన ఆయన దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 1990 నుంచి ఆయన అట్లాంటా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. ఇటీవలే వ్యాపారాన్నీ ప్రారంభించారు. శ్రీరాం సింగ్‌కు ఇద్దరు కుమారులున్నారు. వారిలో అమిత్ సింగ్ అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐలో ఇంజినీరుగా, అంకుర్ సింగ్ క్యాన్సర్ స్పెషలిస్టుగా పని చేస్తున్నారు.






