హెచ్ 1బీ వీసాల్లో మోసాలు!
హెచ్ 1బీ వీసాలు ఇప్పిస్తామంటూ అమెరికాలోని విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసానికి పాల్పడ్డారు. నిందితులు కోర్టులో నేరాన్ని అంగీకరించారు. కిషోర్ దత్తపురం, కుమార్ అశ్వపతి అగ్రరాజ్యంలో నానోసెమాటిక్స్ కంపెనీని కలిసి ప్రారంభించారు. సంతోశ్ గిరి అనే మరో వ్యక్తి నానోసెమాటిక్స్తో కలిసి పనిచేసేవాడు. 10 ముఖ్యమైన వీసాల్లో వీరు మోసాలకు పాల్పడుతున్నారంటూ 2019 ఫిబ్రవరి 28న అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే అశ్వపతి 2020 అక్టోబరు 19న నేరాన్ని అంగీకరించాడు. గిరి ఈ ఏడాది అక్టోబరు 28న మోసాన్ని ఒప్పుకొన్నాడు. తాజాగా జరిగిన విచారణలో కిశోర్ దత్తపురం సైతం నేరాన్ని అంగీకరించాడు. దీంతో వీరికి గరిష్ఠంగా 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష 250,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.






