అమెరికాలో ఉద్యోగం కోసం … యువకుడి ఆరాటం
అమెరికాలో ఉద్యోగం చేయడం చాలామంది యువకుల కల. కానీ, అక్కడ ఇప్పుడు జాబ్ మార్కెట్ దారుణంగా ఉంది. పుణెకు చెందిన ధ్రువ్ లోయా అనే కుర్రాడు అమెరికాలో జాబ్ కొట్టాలనుకొని దాదాపు ఐదు నెలల పాటు అహోరాత్రులు శ్రమించాడు. చివరికి ఆటోమొబైల్ దిగ్గజం టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్టుగా కొలువు సాధించాడు. ఇందుకోసం తాను పడిన శ్రమను అతడు లింక్డిన్ పోస్టులో వెల్లడించారు. ఐదు నెలల వ్యవధిలో తాను ఉద్యోగాల కోసం 300 దరఖాస్తులు, దాదాపు 500కు పైగా ఈమెయిల్స్ పంపానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు 10 ఇంటర్వ్యూలకు హాజరయ్యానని పేర్కొన్నాడు. ఎట్టకేలకు తన కలల కంపెనీ టెస్లా నుంచి ఆఫర్ లెటర్ అందుకొన్నట్లు పేర్కొన్నాడు. ఈ గొప్ప ప్రయాణంలో తనను నమ్మినవారికి, మద్దతు ఇచ్చినవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు.






