Rustom Bhagwagar : అమెరికాలో భారత సంతతి కోపైలట్ అరెస్ట్
                                    భారత సంతతికి చెందిన కోపైలట్ రుస్తుం భగ్వాగర్ (Rustom Bhagwagar) అమెరికాలో అరెస్టయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం (San Francisco Airport)లో అతడిని కాక్‌పిట్ నుంచే పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వర్తిస్తోన్న అతడిపై చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి. డెల్టా సంస్థకు చెందిన బోయింగ్ విమానం మిన్నియాపోలీస్ (Minneapolis) నుంచి బయల్దేరి, శాన్ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయింది. అది దిగిన పది నిమిషాల వ్యవధిలోనే పోలీసులు కాక్‌పిట్‌లో దూసుకువచ్చారు. విమానం నుంచి దిగాలని ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఆ పరిణామంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. లోపలికి వెళ్లిన భద్రతాసిబ్బంది కోపైలట్ భగ్వాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు సంస్థలకు చెందిన దుస్తులు ధరించిన అధికారులు తుపాకులతో లోపలికి వచ్చారు. అతడికి బేడీలు వేసి తీసుకెళ్లారు అని ఓ ప్రయాణికుడు మీడియాకు వెల్లడిరచారు. ఈ అరెస్టు (Arrest) తో భగ్వాగర్ షాక్‌కు గురయ్యారు.







