Washington: వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్ (Washington) డీసీలో ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో యోగా (Yoga) అభ్యసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని భాను మాగులూరి (Bhanu Maguluri) సమన్వయ పరిచారు. ఈ సందర్భంగా టీడీపీ నేత మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) , భాను మాగులూరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను తమజీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండూరు సీతారామారావు, గోవన మోహనరావు (Govana Mohan Rao) , చెరుకూరి ఇందుశేఖర్, నంబూరి చంద్రనాథ్, బండితోపు సత్యనారాయణ, చిట్టెల సుబ్బారావు, బూర్ల రామకృష్ణ, వనపర్తి నాగిరెడ్డి పాల్గొన్నారు.