భారత్, కెనడా మధ్య .. మరో కీలక పరిణామం
భారత్, కెనడా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెనడాలో భారత్‌కు సంబంధించిన కొన్ని షెడ్యూల్డ్ కాన్సులర్ క్యాంప్‌లు రద్దయ్యాయి. ఈ విషయాన్ని టోరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. క్యాప్‌లకు, వాటి నిర్వాహకులకు కెనడా ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని, అందుకే వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. క్యాంప్‌లకు కనీస భద్రత కూడా కల్పించలేమంటూ కెనడా ప్రభుత్వ అధికారులు చేతులెత్తేశారని పేర్కొంది. కెనడాలోని భారతీయ సంఘాలతో కలిసి భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించే కార్యక్రమాలనే కాన్సులర్ క్యాంప్‌లు అంటారు. ఈ నెల 3న కెనడాలో బ్రాంప్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖలిస్తానీ మద్దతుదారులు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే.






