T20 World Cup: ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెలరేగిన భారత బ్యాటర్లు!
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ పోరులో సూర్యకుమార్ సేన 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది.
చాలా కాలం తర్వాత ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ (53) చెలరేగాడు. గాయం నుంచి కోలుకొని టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) కోసం ఫిట్నెస్ నిరూపించుకుంటున్న తిలక్ వర్మ (45) కూడా రాణించాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు చేసి మెరుపులు మెరిపించగా, అక్షర్ పటేల్ (35 నాటౌట్) అజేయంగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 30 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ (24) రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. సంజూ శాంసన్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంచు ప్రభావం ఉన్నప్పటికీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే వికెట్ తీయగా, అభిషేక్ శర్మ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సఫారీ జట్టులో ట్రిస్టన్ స్టబ్స్ (45 నాటౌట్), రికెల్టన్ (44) పోరాడినా ఓటమి తప్పలేదు.






