అమెరికా ఆయుధ సంస్థ సిగ్ సావర్ నుంచి.. సైన్యానికి మరో
అమెరికా ఆయుధ సంస్థ సిగ్ సావర్ నుంచి మరో 73,000 సిగ్ 716 రైఫిళ్ల కొనుగోలుకు మన దేశం నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థకు ఆర్డరు కూడా పెట్టింది. 2019లో మొదటి విడతగా 72,400 రైఫిళ్లను కొనుగోలు చేసింది. రెండో విడత కాంట్రాక్టు పూర్తయితే మొత్తం 1,45,400 సిగ్ 716 రైఫిళ్లను కొనుగోలు చేసినట్లవుతుంది. ప్రపంచంలో రెండో పెద్ద సైన్యమైన భారత సైన్య ఆధునికీకరణలో భాగస్వాములవుతున్నందుకు తమకెంతో గర్వకారణంగా ఉందని సిగ్ సావర్ కంపెనీ సీఈవో రాన్ కోహెన్ ప్రకటించారు. దేశీయంగా రూపొందించిన ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో సిగ్ సావర్ 716 రైఫిళ్లను ప్రవేశపెడుతున్నారు.






