అమెరికాలో ఆశ్రయం కోసం.. భారతీయులు
అమెరికాలో జీవించాలని కలలు కనే భారతీయుల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నది. ఆ దేశంలో ఆశ్రయం కోరినవారి సంఖ్య మూడేండ్లలో 885 శాతం పరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ 2023 అసైలీస్ యాన్యువల్ ఫ్లో రిపోర్ట్ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికా ఆర్థిక సంవత్సరం 2021లో 4,300 మంది భారతీయులు అమెరికాలో ఆశ్రయం కోరారు. 2023 ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య 41,330 ( 855 శాతం) కి పెరిగింది. వీరిలో సగానికిపైగా గుజరాతీయులేనని భారతీయ ఏజెన్సీల అధికారులు చెప్తున్నారు. 2023లో 5,340 మంది భారతీయులకు అమెరికాలో ఆశ్రయం లభించింది.






