India: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
                                    భారత్- బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) సమక్షంలో ఇరుదేశాల వాణిజ్యశాఖ మంత్రులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఇరు దేశాల మధ్య ఏటా 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగుతుందని అంచనా. అనంతరం మోదీ మాట్లాడుతూ భారత్- బ్రిటన్ మధ్య భాగస్వామ్యంలో విజన్ 2035 లక్ష్యంగా సాగుతున్నాం. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో కలిసి సాగుతాం. బ్రిటన్, భారత్ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కనుంది. ఆరు బ్రిటన్ యూనివర్సిటీలు (British universities) భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. పహల్గాం ఘటనను ఖండిరచిన బ్రిటన్ ప్రధానికి ధన్యవాదాలు, ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశమే లేదు. ప్రపంచదేశాల మధ్య శాంతి నెలకొల్పే విషయంలో భారత్-బ్రిటన్లు కలిసి ముందుకు సాగుతాయి. అహ్మదాబాద్ (Ahmedabad) విమాన దుర్ఘటనలో బ్రిటన్లోని ఎన్నారైలు ఉన్నారు. మృతులకు మరోసారి సంతాపం తెలుపుతున్నా. ఎన్నారైలు భారత సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతున్నారు. బ్రిటన్ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు. స్టార్మర్ భారత్కు రావాలని ఆహ్వానిస్తున్నా (Inviting) అని మోదీ పేర్కొన్నారు.







