భారత సంతతి వ్యక్తి అరెస్టు
కెనడాలో భారీగా డ్రగ్స్ గుట్టు రట్టయింది. వాంకోవర్ పరిధిలో అక్రమంగా నడుపుతోన్న ల్యాబ్‌ను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో జరిపిన సోదాల్లో మాదక ద్రవ్యాలతో పాటు పలురకాల రసాయనాలు, ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత సంతతికి చెందిన గగన్‌ప్రీత్ సింగ్ రంధవాను అరెస్టు చేశారు. ఈ సోదాల్లో కెనడా పోలీసులు కేజీలకొద్దీ ఫెంటానిల్, మెథాఫెటమైన్, కొకైన్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ప్రాణాంతక రసాయనాలున్నాయని తెలిపారు. వాటితో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇంకా పలు ఆయుధాలు, 5లక్షల డాలర్ల నగదును గుర్తించారు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం, డ్రగ్స్‌కు సంబంధించి రంధవా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి, సరఫరా చేస్తోన్న గ్రూప్‌ని కొన్ని నెలలపాటు దర్యాప్తు అనంతరం విచ్ఛిన్నం చేయగలిగామని వెల్లడిరచారు. వీరికి అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నాయన్నారు.






