సుందర్ పిచాయ్‌కు విచిత్ర అనుభవం … ట్రంప్‌నకు ఫోన్ చేస్తే!
పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ లేనంత ప్రాధాన్యమిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది. ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు చెప్పాలని గూగుల్ సీఈవో సుందర్ పించాయ్ ఫోన్ చేస్తే, ఆ కాల్లో ఎలాన్ మస్క్‌నూ ట్రంప్ కలిపారు. అమెరికా ఎన్నికల్లో గూగుల్ పక్షపాతంగా వ్యవహరించిందని గత వారమే మస్క్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఉక్రెయిన్ సహా వివిధ దేశాధినేతలు ఫోన్ చేసినప్పుడూ ట్రంప్ ఇలాగే కాల్‌ను మస్క్‌కు కలిపారు.






