భారతీయులకు శుభవార్త … వీసా లేకుండా రష్యాకు!
భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న రష్యా వీసారహిత పర్యటనలకు అనుమతి ఇచ్చే అంశంపై కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కీలక దశలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2025 స్ప్రింగ్ సీజన్ నుంచి వీస్రా-ఫ్రీ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రష్యాకు చెందిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు. ఈ ఒప్పందానికి సంబంధించి పురోగతి కనిపిస్తోందని దీంతో భారత్ నుంచి పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు అంచనా వేస్తున్నామని మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ తాజాగా వెల్లడించారు.






