భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్
భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల వీసాలను 20,000 నుంచి 90,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడిరచారు. న్యూఢల్లీిలో జరిగిన 18వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024లో ప్రధాని మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. రాబోయే 25 ఏళ్లలో వికసిత్ భారత్కు రోడ్ మ్యాప్ రూపొందించినట్లు తెలిపారు. ఈ ముఖ్యమైన సమయంలో జర్మన్ క్యాబినెట్ ఫోకస్ ఆన్ ఇండియా పేరిట డాక్యుమెంట్ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ నిర్ణయం జర్మనీ వృద్ధికి దోహదపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో జర్మనీ ఛాన్సరల్ ఓలాఫ్ షోల్జ్ కూడా పాల్గొన్నారు.






