వారి సమస్యల పరిష్కారానికి కృషి : గంటా శ్రీనివాస్
దుబాయ్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన దుబాయ్ లోని టీడీపీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రవాసాంధ్రులు గమనించి మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు తమ వంతు సహాయ, సహకారాలు అందించారన్నారు. గల్ఫ్‌లో ఉంటున్న వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ ముక్కు తులసీకుమార్, విశ్వేశ్వరరావు, వాసురెడ్డి, కె.రవికిరణ్, నిరంజన్, జనసేన నాయకులు కేసరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.






