ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో.. ఒకరు భారతీయులే : నిర్మలా సీతారామన్
ఆధిపత్యాన్ని ప్రదర్శించడంపై భారతదేశ వైఖరి కాదని, ప్రపంచ యువనికపై తన ప్రభావాన్ని పెంచుకోవడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా, చైనా సహా ఏ దేశమూ ఇప్పుడు భారత్‌ను నిర్లక్ష్యం చేయలేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచ బ్యాంకు, బ్రెటన్ ఉడ్స్, ఐఎంఎఫ్ సంస్థలతో వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చారు. ఈ సందర్భంగా వాషింగ్టన్లో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులే. మా దేశ ఆర్థిక ప్రగతిని ఎవరూ నిర్లక్ష్యం చేయలేరు అని ఆమె పేర్కొన్నారు.






