శ్రీశ్రీ రవిశంకర్‌కు అత్యున్నత పౌర పురస్కారం
ప్రపంచ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఫిజీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. మనుషుల్లో స్ఫూర్తిని పెంపొందించడానికి, విభిన్న సమాజాలను శాంతి, సామరస్యంతో ఒక చోటికి తీసుకురావడానికి ఆయన అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసింది. హానరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకర్‌కు ఫిజీ అధ్యక్షుడు రుతు విలియం ఎం కటోనివెరె ప్రదానం చేశారు. దీంతో శ్రీశ్రీ రవిశంకర్‌కు అత్యున్నత పౌర పురష్కారాన్ని అందించిన ఆరోజు దేశంగా ఫిజీ నిలిచింది.






