లింగ వివక్షకు భారీ మూల్యం … ఎఫ్బీఐ చరిత్రలో ఇదే
శిక్షణ సమయంలో లింగ వివక్ష చూపడంతో పాటు మహిళా ట్రైనీలను లైంగికంగా వేధించిన కేసులో అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎఫ్బీఐ) భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 34 మంది తొలగించిన మహిళలకు రూ.184.2 కోట్లను పరిహారంగా అందించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. వర్జీనియా లోని క్యాంటికో అకాడమీలో శిక్షణ సమయంలో మహిళా ట్రైనీలపై శిక్షకులు లింగ వివక్ష చూపారు. వారిపై అసభ్యకర కామెంట్లు చేశారు. ఆ తర్వాత వారిని వివిధ కారణాలతో తొలగించారు. దీంతో 2019లో ఎఫ్బీఐపై వారు దావా వేశారు. విచారణల అనంతరం బాధితులతో సంస్థ ఒప్పందానికి వచ్చింది. వారికి రూ.184.2 కోట్లను చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని కోర్టు ఆమోదించాల్సి ఉంది. ఎఫ్బీఐ చరిత్రలో ఇదే అతి పెద్ద దావా కావడం గమనార్హం.






