పాకిస్థాన్ పర్యటనకు కేంద్రమంత్రి జైశంకర్.. ఎందుకంటే?
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 15 -16 తేదీల్లో ఇస్లామబాద్ వేదికగా జరగనున్న వార్షిక షాంఘై సహకార సంఘం (ఎస్సీవో) సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడిరచారు. ఈసారి ఎన్సీవో సదస్సుకు ఆతిథ్యం ఇస్తోన్న పాకిస్థాన్ నుంచి ఆహ్వానం అందినట్లు ఆగస్టు 30న కేంద్రం ధ్రువీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్సీవో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక`సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించనున్నారు. దీంతోపాటు రౌండ్లలో సీనియర్ అధికారులు సమావేశాలు జరగనున్నాయి.






