అమెరికా నుంచి వెళ్లిపోతా .. ఇక్కడ భవిష్యత్ లేదు
అమెరికా ఎన్నికల ఫలితాలపై టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఖుషీగా ఉండగా, ఆయన కుమార్తె వివవియన్ జెన్నా విల్సన్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. తనకు అమెరికాలో భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం థ్రెడ్స్‌లో ఓ పోస్టును పెట్టింది. నేను కొన్నాళ్లుగా భయపడుతున్నది నిన్న వాస్తవ రూపం ధరించింది. అమెరికాలో ఉంటే నాకు ఎటువంటి భవిష్యత్తు కనిపించడం లేదు. అతడు (ట్రంప్) నాలుగేళ్లే అధ్యక్షుడిగా ఉండనున్నా, లింగ మార్పిడి వ్యతిరేక నిబంధనలు ఒక్కసారిగా అమల్లోకి రాకపోయినా, వాటిని కావాలని ఓటేసినవారు అంత తొందరగా మారరుగా అని ఆవేదన పూరితంగా పేర్కొంది. ఆమె అమెరికాను వీడుతుందన్న పోస్టు గురించి తెలుసుకొన్న మస్క్ కూడా ఎక్స్‌లో స్పందించారు. నా కుమారుడిని ఓక్ మైండ్ సెట్ చంపేసింది అని మరోసారి పునరుద్ఘాటించారు.
దీనిపై జెన్నా స్పందిస్తూ తన తండ్రి ట్వీట్ స్క్రీన్ షాట్‌ను థ్రెడ్‌లో పోస్టు చేసింది. ఇంకా నా బిడ్డకు ఏదో సోకింది. నన్ను నా బిడ్డ ద్వేషించడానికి అదే కారణం అంటూ మళ్లీ పాత కథలే చెప్పొద్దు. వాటిని పట్టించుకోవద్దు. ఏరకంగా చూసినా నేనే బాధితురాలిని అని రాసుకొచ్చింది. ఎలాన్ మస్క్ తొలి భార్యకు జన్మించిన సంతానంలో జస్టిన్ విల్సన్ కూడా ఒకరు. 2022లో లింగ మార్పిడి చేయించుకొని తన పేరును వివియన్ జెన్నా విల్సన్‌గా మార్చుకొంది. మస్క్‌కు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఆమె తన తండ్రికి దూరంగా ఉంటోంది.






