భారత ఎన్నికల ప్రక్రియపై మస్క్ ప్రశంసలు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 64 కోట్ల ఓట్లను భారత్ ఒక్కరోజే ఎలా లెక్కించగలిగింది? అనే శీర్షికతో ప్రచురితమైన ఓ వార్త కథనాన్ని మస్క్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనికి ఆయన భారత్ ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది. కానీ, కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉంది అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటికీ కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోవడం గమనార్హం.






