దీనివల్ల అమెరికా ఎప్పుడూ చూడని ఎత్తుకు : మస్క్
త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఫెడరల్ బడ్జెట్లో దుబారా ఖర్చులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఎలాన్ మస్క్‌ను కొత్త ప్రభుత్వ పార్లమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్నీ విభాగానికి అధిపతిగా నియమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ చైర్మన్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆయన మస్క్‌ను ప్రస్తుత ప్రభుత్వం అనవసర ఖర్చుల కోసం వృథా చేస్తున్న దాంటో ఎంతవరకు ఆదా చేస్తారు అని అడిగిన ప్రశ్నకు మస్క్ బదులిస్తూ దాదాపు రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చని అన్నారు. రెట్టింపు ఖర్చులనీ ప్రజల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నులే అన్నారు. దీని ద్వారా దేశ ప్రజల డబ్బే వృథా అవుతోందని, ట్రంప్ ప్రభుత్వ సమర్థత విభాగం ఈ సమస్యను పరిష్కరిస్తుందని మస్క్ పేర్కొన్నారు. దీనివల్ల అమెరికా ఎప్పుడూ చూడని ఎత్తులకు చేరుకుంటుందన్నారు. ట్రంప్ మద్దతుదారులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని, ముందస్తు పోలింగ్‌లో ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.






