NATO: నాటో కూటమి నుంచి అమెరికా వచ్చేయాలి

పరస్పర రక్షణ కోసం ఉద్దేశించిన నాటో (NATO) దేశాల కూటమి నుంచి అమెరికా (America) బయటకు వచ్చేయాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) నుంచి కూడా బjటపడాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) మంత్రివర్గంలో ఆయన సభ్యుడు కానప్పటికీ, ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగా (డోగ్) నికి ఆధిపత్యం వహిస్తుండడం గమనార్హం. ఎవరో ఒక వ్యక్తి నాటో, ఐరాస (United Nations) నుంచి అమెరికా బయటకు రావాల్సిన సమయం వచ్చింది అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఇందుకు మస్క్ స్పందిస్తూ నేను అంగీకరిస్తున్నా అని పేర్కొన్నారు. వివిధ దేశాలకు ఆర్థిక సాయం చేయడానికి ఉద్దేశించిన యూఎస్ ఎయిడ్ సంస్థను కూడా ఆయన క్రిమినల్ ఆర్గనైజేషన్ గా పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ వ్యయాల తగ్గింపు పేరుతో ఆ సంస్థను రద్దు చేయించడానికి కూడా ప్రయత్నిస్తుండడం గమనార్హం.