Iran: భూకంపాలతో భయపెడుతున్న ఇరాన్
ఇజ్రాయిల్(Israel) – ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో.. ఇరాన్ లో వస్తున్న భూకంపాలు(earthquake) ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు రోజుల 2.5 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత శుక్రవారం ఇరాన్ను 5.1 తీవ్రతతో భూకంపం అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ద వాతావారణం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఈ భూకంపాలకు అణు ప్రయోగాలకు సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలి శాటిలైట్ ఫోటోలు, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఇరాన్ సరిహద్దు దేశాలను కలవరపెడుతున్నాయి.
వాస్తవానికి ఇరాన్ ఆల్పైన్-హిమాలయన్ భూకంప బెల్ట్ లో ఉండటం వల్ల తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అణు ప్రేరిత భూకంపాలు P-తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. సహజ భూకంపాలు P, S-తరంగాలు రెండింటికీ కారణమవుతాయంటున్నారు నిపుణులు. డేటా ప్రకారం 2006 – 2015 మధ్య ఇరాన్లో 96,000 భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.19 గంటలకు ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
శుక్రవారం నాటి భూకంపం సెమ్నాన్కు నైరుతి దిశలో దాదాపు 36 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో సంభవించింది. ఏటా 2,000 కంటే ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి, వీటిలో 5.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో 15 నుండి 16 భూకంపాలు ఉన్నాయి. అణు కార్యకలాపాలు, ముఖ్యంగా భూగర్భ అణు పేలుళ్లు, పేలుడు దగ్గర టెక్టోనిక్ ప్లేట్ లపై ఒత్తిడిని విడుదల చేయడం ద్వారా భూకంపాలకు కారణమవుతాయి. పేలుడు జరిగిన ప్రదేశం నుండి కొన్ని పదుల కిలోమీటర్ల పరిధి వరకు ప్రభావం చూపిస్తాయి.







