జర్మనీలో ఘనంగా దీపావళి వేడుకలు
జర్మనీ దేశంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. భారత్ వాసి జర్మనీ సంఘం నేతృత్వంలో మెయిన్జ్ `వీస్బాడెన్లో ఉత్సవాలు నిర్వహించారు. వైద్యం, ఔషద, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో విశేష కృషి చేసిన భారతీయ ప్రవాసులకు ఈ వేడుకల్లో ప్రత్యేకంగా సన్మానించారు. కార్డియోపల్మనరీ వ్యాధుల చికిత్స, పరిశోధనలో కృషి చేసినందుకు ఆచార్య సోనీ సావా, సుప్రా మాలిక్యూలర్ కెమెస్ట్రీలో భవిష్యత్తరాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న డాక్టర్ శిఖా దిమాన్, సంప్రదాయ వైద్య పరిశోధనలో కృషి చేసిన కృష్ణరాజ్ రాజలింగం, మానవ వ్యాధులపై చెతన్యవంతమైన పరిశోధనల్లో వినూత్నమైన పరిశోధనలకు గాను డా.విజయ్ తివారీని సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా ప్రవాసీయ విద్యార్థులు, యువత, మహిళలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతనాట్య శైలిలో దశావతార్ నృత్య రూపకం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన దాదాపు 400 మంది వరకు హాజరయ్యారు.






