Nobel Prize : నోబెల్‌కు ట్రంప్‌ను ప్రతిపాదించిన మర్నాడే

ఉగ్రవాదానికి పుట్టినిల్లైన పాకిస్థాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును నోబెల్ బహుమతి (Nobel Prize)కి ప్రతిపాదించిన మరుసటి రోజే అగ్రరాజ్యం ఇరాన్ (Iran)పై దాడికి తెగబడిరది. దీంతో పాక్(Pak) పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా మారింది. పొరుగు దేశమైన ఇరాన్, సూపర్ పవర్ అమెరికా మధ్య ఎటు మొగ్గాలో తేల్చుకోలేక పాక్ హైరాన్ పడుతోంది. నిన్నటి వరకు ట్రంప్ శాంతి కపోతం అంటూ పొడిగిన ఇస్లామాబాద్ (Islamabad) ఇప్పుడు ఇరాన్‌పై దాడితో ఆయన్ను ఏమనాలో అర్థం కాక తలబద్దలు కొట్టుకుంటోంది. అగ్రరాజ్యం అంతర్జాతీయ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి ఇరాన్‌పై దాడులకు పాల్పడిదంటూ పాక్ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆరోపించింది.