పాక్ కొత్త ప్రధాని షెబాజ్ కు.. అమెరికా అభినందనలు

పాకిస్థాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెబాజ్ షరీప్‌కు అమెరికా అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక సందేశం పంపారు. పాక్ ప్రభుత్వంతో సుదీర్ఘ సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. దాదాపు 75 ఏళ్ళుగా విస్తృత, పరస్పర ప్రయోజనాలపై కీలకమైన భాగస్వామిగా వుందని, అమెరికా ఈ సబంధాలకు ఎంతో విలువనిస్తుందని తెలిపారు. పటిష్టమైన, ఇరు దేశాల ప్రయోజనాలకు ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా సందేశంపై పాక్ ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించింది.