జవవరి 20లోగా అమెరికాకు … వెంటనే వచ్చేయండి!
విదేశీ విద్యార్థులు, బోధనా సిబ్బంది, పరిశోధకులకు అమెరికా కాలేజీలు అలర్ట్ సందేశాలు పంపాయి. శీతాకాలం సెలవులకు స్వదేశాలు వెళ్లిన వారంతా త్వరగా వెనక్కి వచ్చేయాలన్నది ఆ సందేశాల సారాంశం. 2025 జనవరి 25లోగా అమెరికా తిరిగి రావాలని కోరుతూ మసాచుసెట్స్ అమ్హెర్న్ విశ్వవిద్యాలయం సహా కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ఈ మేరకు ట్రావెల్ అడ్వయిజరీకి సంబంధించి అధికారిక మెసేజ్‌లు పంపాయి. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేస్తే ఇమిగ్రేషన్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.
2017లో మొదటిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ అమలు చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. అప్పట్లో చెల్లుబాటయ్యే వీసాలను ఉపయోగించి యూఎస్‌కి తిరిగివచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులకు ఇబ్బంది కలిగింది. అమెరికా రావడానికి కొన్ని వారాలు నిరీక్షించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. గ్లోబల్ అఫైర్స్‌కు సంబంధించి ఉమాస్ అమ్హర్సెట్స్ ఇటీవల హాలిడే బ్రేక్ ట్రావెల్ అడ్వయిజరీని జారీ చేసింది. అమెరికా బయటకు వెళ్లిన విద్యార్థులు, స్కాలర్లు బోధనా సిబ్బంది వెంటనే తిరిగి వారాలని సూచించింది. ఈ క్రమంలో 2017 నాటి అనుభవాలను కూడా పంచుకుంది.






