భారత్‌పై ఆరోపణలకు ముందే.. అమెరికాకు
తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ కెనడా ఇటీవల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌పై ఆరోపణలు చేయడానికి ముందే మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అమెరికా వార్తా పత్రికకు ట్రూడో సన్నిహితులు అందజేశారని తెలిసింది. ట్రూడో ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్, డిప్యూటీ మంత్రి డేవిడ్ మారిసన్‌లు వాషింగ్టన్ పోస్టుకు సున్నితమైన సమాచారం అందజేసినట్లు కెనడా పత్రిక పేర్కొంది. ముఖ్యంగా ఖలిస్థానీ వేర్పాటువాదుల హత్యలో పాత్రతోపాటు తమ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై వారు మాట్లాడినట్లు తెలిపింది. భారత్‌పై కెనడా పోలీసులు ఆరోపణలు చేసే కొన్ని రోజుల ముందే అమెరికా మీడియాకు ట్రూడో సన్నిహితులు ఈ సమాచారం చేరవేశారని తెలిసింది.






