Flight: ప్రమాదంలో మరో బోయింగ్ డ్రీం లైనర్.. అదే విమానం అదే కథ..!

ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రమాదం జరిగిన తర్వాత విమాన ప్రయాణం మాట వింటేనే ప్రజల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా బోయింగ్(Boing) విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల డెన్వర్ విమానాశ్రయంలో ఓ విమానం మంటల్లో చిక్కుకోగా మరో విమానం ఇప్పుడు ప్రమాదానికి గురైంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నడుపుతున్న యూఏ108 విమానం.. మ్యూనిచ్‌కు బయల్దేరి వెళ్తోంది. బోయింగ్ కంపెనీ యొక్క.. 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఇది.
వాషింగ్టన్ నుండి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎడమ ఇంజిన్ ఫెయిల్ అయిందని అధికారులు వెల్లడించారు. దీనితో పైలెట్ లు మే డే కాల్ ఇచ్చారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ విమానం కూడా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కావడం గమనార్హం. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాదాపు 5,000 అడుగుల ఎత్తులో విమానం ఎడమ ఇంజిన్ ఆగిపోయింది.
దీనితో జూలై 25, 2025న UA108 విమానంలోని పైలెట్ లు మేడే కాల్ ఇచ్చినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారం ఇచ్చి, విమానాశ్రయానికి సురక్షితంగా విమానాన్ని తీసుకు రావడానికి ఎమర్జెన్సీ పద్దతులను అవలంభించారు అని అమెరికన్ మీడియా వెల్లడించింది. ఫ్లైట్ అవేర్ నుండి వచ్చిన డేటా ప్రకారం, ‘మేడే’ కాల్ ఇచ్చిన తర్వాత కూడా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం 2 గంటల 38 నిమిషాల పాటు గగనతలంలో ఉండిపోయింది.
వాషింగ్టన్, డల్లెస్ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ చేసే ఎటువంటి ప్రమాదం జరగకుండా.. ముందు ఫ్లైట్ లో భారీగా ఉన్న ఇంధనాన్ని సురక్షితంగా డంప్ చేసేందుకు విమానం వాషింగ్టన్ వాయువ్య దిశలో హోల్డింగ్ ప్యాటర్న్ లో ప్రదక్షిణలు చేస్తూనే ఉందని ఫ్లైట్ అవేర్ పేర్కొంది. ఈ ఘటనపై అమెరికా విమానయాన శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాలను అంతర్జాతీయ విమానయాన సంస్థలు వినియోగించవద్దనే డిమాండ్ లు బలపడుతున్నాయి.