ఇజ్రాయెల్‌కు ఆంటోనీ బ్లింకెన్ సలహా.. బందీలను ఇంటికి
కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సలహా ఇచ్చారు. బందీలను ఇంటికి తెచ్చుకోవాలని సూచించారు. పశ్చిమాసియా పర్యటనకు వచ్చిన ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజాకు సంబంధించి కీలక లక్ష్యాలన్నింటినీ దాదాపు ఇజ్రాయెల్ సాధించింది. ఇప్పుడు వాటిని ఎప్పటికీ నిలిచిపోయే వ్యూహాత్మక విజయాలుగా మలచుకోవాలి. చేయడానికి ఒక రెండు పనులే మిగిలి ఉన్నాయి. బందీలను ఇంటికి తెచ్చుకోవడం, యుద్ధాన్ని ముగించడం అని చెప్పారు.






