ఉక్రెయిన్‌కు 5వేల కోట్ల డాలర్ల రుణాలపై.. ముందుకె వెళ్లనున్న జి-7
వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా సెంట్రల్ బ్యాంకు ఆస్తులపై వచ్చే వడ్డీ ద్వారా ఉక్రెయిన్‌కు 5 వేల కోట్ల డాలర్ల రుణాలు అందించాలన్న తమ ప్రణాళికపై జి-7 దేశాలు ముందుకే వెళ్లనున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. అందులో తమ వంతు వాటాగా 2 వేల కోట్ల డాలర్లు అందిస్తామని తెలిపింది. ఈ మొత్తాన్ని ఆర్థిక, సైనిక సాయంగా విభజిస్తామని శ్వేత సాధంలో జాతీయ భద్రత ఉప సలహాదారు దలీప్ సింగ్ వెల్లడిరచారు. మిలిటరీ సాయం కింద అందించే మొత్తానికి చట్టసభల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. మిగిళిన 3 వేల కోట్ల డాలర్లను ఈయూ, బ్రిటన్, కెనడా తదితర దేశాలు సమకూరుస్తాయని వివరించారు.






