అమెరికాలో 10 రోజుల్లో రెండో ఘటన
అమెరికాలోని హిందూ దేవాలయంపై ద్వేషపూరిత రాతలు మరోసారి వెలుగుచూసాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో బాప్ప్ శ్రీ స్వామినారాయణ మందిర గోడలపై గుర్తుతెలియని వ్యక్తులు హిందువులు వెనక్కి వెళ్లండి అంటూ గ్రాఫిటితో విద్వేషపూరిత రాతలు రాశారు. అలాగే ఆలయానికి వెళ్లే నీటి పైపుల్ని సైతం ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై తాజాగా ఆలయ అధికారులు స్పందించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి 10 రోజుల మందు న్యూయార్క్‌లోని బాప్స్ మందిరంపై ఇదే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టినట్లు శాక్రమెంటో పోలీసులు తెలిపారు.






