విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా పరిమితి
పెరుగుతున్న వలసలను నియంత్రించే దిశగా ఆస్ట్రేలియా అడుగులు వేస్తోంది. ఇందు కోసం విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై పరిమితులు విధించనున్నట్లు విద్యాశాఖ మంత్రి జాన్సర్ క్లేర్ వెల్లడించారు. 2025కు గాను 2.70 లక్షల మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. 1.45 లక్షల మందికి విశ్వవిద్యాలయాల్లో, మరో 95వేల మందికి నైపుణ్య శిక్షణ రంగాల్లో ప్రవేశాలకు అనుమతించనున్నట్లు తెలిపారు. 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులను వీసా మంజూరు చేశామని తెలిపారు. ఆ ఏడాది ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో విదేశీ విద్యార్థుల వాటా 48 బిలియన్ల డాలర్లు.






