America : ఇరాన్‌పై దాడులు అమెరికా పలుచోట్ల హైఅలర్ట్

ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా (America) దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. దీనికి ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతోంది. అందులో భాగంగా ప్రార్థనాస్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్ (Washington)తో సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇరాన్ (Iran)లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీసు అధికారులు తెలిపారు.
మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లాస్‌ఏంజెలెస్ (Los Angeles) మేయర్ కరన్ బాస్ (Karan Boss) కూడా ఇలాంటి ఓ ప్రకటన చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజా భద్రతకు ముప్పు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. ప్రార్థనా స్థలాలు, జనసమూహ ప్రాంతాలతో సహా ఇతర సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను పెంచినట్లు పేర్కొన్నారు. మెట్రో పాలిటన్ పోలీస్ అధికారులు కూడా కొలంబియా (Colombia) లో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.