అమెరికా వర్సిటీలో కాల్పులు
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఉన్న టస్కీజీ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మరణించిన వ్యక్తి వర్సిటీ విద్యార్థి కాదని, గాయపడ్డవారు మాత్రం విశ్వవిద్యాలయ విద్యార్థులేనని అధికారులు తెలిపారు. మోంట్గోమెరీకి 30 కిలోమీటర్ల దూరంలో టస్కీజీ విశ్వవిద్యాలయం ఉంది. వర్సిటీలో 100 ఏళ్ల ఉత్సవం జరగుతుండగా ఈ కాల్పులు జరిగాయి. దాదాపు 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఓ విద్యార్థిని పొట్టలని బుల్లెట్ దూసుకెళ్లిందని, మరో విద్యార్థి చేతికి గాయమైందని వెల్లడిరచారు. ఈ విశ్వవిద్యాలయం చారిత్రక ఆఫ్రో అమెరికన్ వర్సిటీగా ప్రసిద్ధి చెందింది.






