Iran: లొంగిపోయే ప్రసక్తే లేదు : ఇరాన్
తమపై దాడి చేసి ఇజ్రాయెల్(Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని (Ayatollah Ali Khamenei) పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల వేళ వీడియో సందేశం విడుదల చేసిన ఆయన ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని తెలసుకోవాలన్నారు. ట్రంప్ (Trump) హెచ్చరికలను ఉద్దేశిస్తూ అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందన్నారు. అంతేకాదు అమెరికా (America) సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెసుకోవాలన్నారు.







