ఐరాసలో రష్యాకు మరోసారి ఎదురుదెబ్బ

రష్యాకు ఐక్యరాజ్యసమితిలో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఐరాసకు చెందిన నాలుగు కమిటీల ఎన్నికల్లో పాల్గొన్న రష్యా నాలిగింటిలో పరాజయం పాలైంది. ఐరాస ఆర్థిక, సామాజిక మండలి ఈ ఎన్నికలను నిర్వహించింది. ఒక ఎన్నికలో రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించింది. ప్రపంచ దేశాలు రష్యా దాడిని సమర్థించడం లేదనే విషయాన్ని తాజా ఫలితాలు చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమిటీ ఆఫ్ ఎన్‌జీఓస్, యూఎన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, పర్మినెంట్ ఫోరమ్ ఆన్ ఇండిజీనస్ ఇస్యూస్ కమిటీలకు జరిగిన ఎన్నికల్లో రష్యా పోటీ చేసింది. రష్యా ఓటమిని ఐరాసలో బ్రిటన్ రాయబారి వెల్లడిరచారు.