దీపావళి వేడుకల్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ఈ వేడుకలను భారతీయులతో పాటు విదేశీయులు సైతం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి వేడుకల్లో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా స్టెపులేశారు. ఎరిక్ గార్సెట్టి భారత ఆచారాలు, సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయా సందర్భాల్లో చూశాం. తాజాగా దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ, అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యాడ్ న్యూజ్ చిత్రంలోని తౌబా తౌబా పాటకు అదిరిపోయే స్టెపులేశారు. గార్సెట్టి ఇలా తన డ్యాన్స్ స్కిల్స్‌తో ఆకట్టుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా తన నృత్య ప్రదర్శనతో అందరి ఆకట్టుకున్నారు.






