ఆ భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. ఎందుకంటే ?
అమెరికాలో అక్రమ వలసదారులను నియంత్రించాలని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (డీహెచ్ఎస్) ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్ఎస్ పేర్కొంది. అక్టోబరు 22న ప్రత్యేక విమానంలో వీరిని భారత్కు పంపినట్లు తెలిపింది. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా వెల్లడిరచింది. చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయ పౌరులను వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం అని డీహెచ్ఎస్ సీనియర్ అధికారి క్రిస్టీ ఎ.కనెగాల్లో పేర్కొన్నారు.






