మా బలగాలు సిద్ధంగా ఉన్నాయి : అమెరికా
లెబనాన్‌లో వందలాది లక్ష్యాలపై ఇజ్రాయెల్ గురిపెట్టాక మధ్యప్రాచ్యంలో తమ సైనిక సంసిద్ధత, సామర్థ్యాలను మరింత పెంచుకున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనంలో జాతీయ భద్రతా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడారు. తన నేలకు ప్రజలకు పొంచి ఉన్న ముప్పును తొలగించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. మనల్ని మనం రక్షించుకోవడానికి, ఇజ్రాయెల్‌ను రక్షించడంలో సహాయపడటానికి ఇప్పటికే మధ్యప్రాచ్యానికి అదనపు బలగాలను పంపాం. సైనిక సంసిద్ధత, సామర్థ్యాలను ఆ రీజియన్‌లో మరింత పెంచుకున్నాం. ఏప్రిల్‌లో ఇరాన్ ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినప్పటి నుంచి మరిన్ని దళాలను పంపాం. అప్రమత్తంగా ఉండాలని తూర్పు మధ్యధరా సముద్రంలోని విమాన వాహక నౌక, నావికా దళాలను ఆదేశించాం అని కిర్బీ అన్నారు.






