Air India :787 డ్రీమ్‌లైనర్ ఇంధన వ్యవస్థలో లోపం లేదు :అమెరికా ఎఫ్ఏఏ
                                    అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిరిండియా (Air India) బోయింగ్ 787 విమానం ఇంధన వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకటించింది. ఎఫ్ఏఏ అడ్మిన్‌స్ట్రేటర్ బ్రెయాన్ బెడ్ఫోర్డ్ (Brian Bedford ) మాట్లాడుతూ ఈ విమాన ప్రమాదం యాంత్రిక వైఫల్యం లేదా హఠాత్తుగా ఇంధన నియంత్రణ స్విచ్‌ల్లో మార్పుల కారణంగా జరగలేదన్నారు. ఎఫ్ఏఏ (FAA) అధికారులు స్విచ్ యూనిట్లను విమానంపై అమర్చి పరీక్షించారని, ఇంధన సరఫరా వ్యవస్థలో సమస్యలు కనిపించలేదని బ్రెయాన్ వెల్లడిరచారు. ఈ వ్యాఖ్యలపై బోయింగ్ , ఎయిరిండియా సంస్థలు స్పందించలేదు.







